బడ్జెట్ 2021: రైతు సంక్షేమానికి 16.5 లక్షల కోట్ల కేటాయింపు..

134
Minister Nirmala Sitharaman
- Advertisement -

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ . 16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ధేశించినట్టు తెలిపారు. గ్రామీణ మౌలిక నిధికి కేటాయింపులను రూ . 40,000 కోట్లకు పెంచామని చెప్పారు. ఇక గత ఏడాది గోధుమల కనీస మద్దతు ధర కోసం రూ. 75,000 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. దీంతో 43 లక్షల మందికి పైగా గోధుమలు పండించే రైతులకు లబ్ధి చేకూరిందని ఆమె వెల్లడించారు.

షౌష్టికాహారం అందరికీ అందించేందుకు మిషన్‌ పోషణ్‌ 2.0 చేపట్టనున్నట్టు తెలిపారు. రూ.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి చేయనున్నారు. 13 రంగాల్లో పీఎల్‌ఐ ప్రోత్సాహకాల కోసం ఖర్చుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఐదేళ్లలో స్వచ్ఛభారత్‌ 2.0 కోసం రూ.1,41,678 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.

మరో కోటి మంది లబ్ధిదారులకు ఎల్‌పీజీ ఉజ్వల్‌ యోజనను అందుబాటులో తీసుకురానున్నట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వచ్చే మూడేళ్లలో 100 జిల్లాలకు గ్యాస్‌ పైప్‌లైన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. మూలధనం సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 20వేల కోట్లు అందించనున్నట్టు ఆమె పేర్కొన్నారు.

- Advertisement -