షడ్రుచుల సమ్మేళనం..ఉగాది

680
ugadi_
- Advertisement -

ఉగాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వేడుక ఉగాది. తీయనైన వసంత కోయిల పాట ఉగాది. షడ్రుచుల మేలవింపు మన తెలుగు సంవత్సరాది ఉగాది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది. ఉగాది. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ugadi_

ఉగాది ప్రాముఖ్యంచైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి రాబోయే ఏడాదినంతా తలుచుకుంటూ తయారు చేసే ఉగాది పచ్చడి ఈ పండుగ స్పెషాలిటీ. షడ్రుచుల పులుపు, ఉప్పు, కారం.. చేదు. వగరు, తీపి కలయికతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడి.. మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సూచిస్తుంది. అన్నింటిని కలిపితేనే జీవితమన్న సత్యాన్ని ప్రజలకు బోధిస్తుంది.

బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం, ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం, వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు, చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు, పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు, కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులను తెలియజేస్తుంది. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగును తీసుకురావాలని గ్రేట్‌ తెలంగాణ. కామ్‌ మనస్పూర్తిగా కోరుకుంటూ మీ అందరికి  ఉగాది శుభాకాంక్షలు.

Also Read:కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత!

- Advertisement -