Uma Bharati:హ్యాపీ బర్త్ డే.. ఫైర్ బ్రాండ్

36
- Advertisement -

భారతదేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నాయకురాలు ఉమా భారతి. 25 సంవత్సరాల వయస్సులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఉమాభారాతి అంచెలంచెలుంగా సీఎం స్ధాయి వరకు ఎదిగారు.రామ్‌లాలా హమ్ ఆయేంగే, మందిర్‌వహింబానాయేంగే అనే నినాదంతో బాబ్రీ మసీదును కూల్చివేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. దీంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన తర్వాత అదే పని సీఎం పదవి కొల్పేయేలా చేసింది. ఇవాళ ఆమె బర్త్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

1959, మే 3న మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని టిటాంగర్‌ జిల్లాలోని దుండాలో లోఢి రాజ్‌పుత్ కుంటుంబంలో జన్మించింది. చిన్న వయస్సులోనే పురాణాలపై అధ్యయనం చేసిన ఉమాభారతి…రాజమాత విజయరాజె సింధియా సంరక్షణలో పెరిగి హిందూత్వ ప్రచారకురాలిగా మారారు. కాషాయ వస్త్రాలు ధరించి అనేక దేశాలలో ప్రసంగాలు చేశారు.

1984లో తొలిసారి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. అయితే తిరిగి 1989లో ఖజురాహో స్థానం నుండి పోటీచేసి విజయం సాధించింది. ఆ తర్వాత 1991, 1996, 1998లలో అదే స్థానం నుండి వరస విజయాలను నమోదుచేసింది. 1999లో స్థానం మార్చి భోపాల్ నియోజకవర్గం నుండి గెలుపొంది కేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిపదవి చేపట్టారు. ఇక 2003 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆమె నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాలుగింట మూడువంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించింది. మొత్తం 230 స్ధానాల్లో 173 స్ధానాల్లో బీజేపీ విజయం సాధించగా సీఎం పీఠాన్ని అధిరోహించారు.

అయితే సంవత్సరం తిరగకుండానే 2004 ఆగస్టులో “1994 హుబ్లీ వివాదం” కేసులో అరెస్టు వారెంటు జారీకావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించింది. ఆమె స్ధానంలో శివరాజ్ సింగ్ చౌహాన్‌ను సీఎంగా నియమించింది బీజేపీ. అయితే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె భారతీయ జనతా పార్టీని వీడి భారతీయ జన శక్తి కొత్త పార్టీని స్థాపించింది.

Also Read:త్వరలో నిమ్స్‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ..

2008లో జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే తర్వాత బీజేపీ ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో 2011లో తిరిగి బీజేపీలో చేరి తన పార్టీని వీలినం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ నియోజకవర్గం నుండి 1,90,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 నుండి 1 సెప్టెంబర్ 2017 వరకు జలవనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవన శాఖ మంత్రిగా పనిచేశారు

Also Read:IPL 2023:డబుల్ ధమాకా..గెలిచేదెవ్వరు!

1985: 25 ఏళ్ల వయస్సులో మొదటిసారిగా లోక్‌సభ ఎన్నికల పోటీ.
1989, 1991, 1996, 1998 ఖజురహో లోక్‌సభ నుండి ఎంపీగా గెలుపు
1999: భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు
2003: 75% ఓట్లతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు,సీఎంగా బాధ్యతలు
2004: బిజెపి నుండి సస్పెండ్
2006: భారతీయ జనశక్తి పార్టీని స్థాపన
2005 ఆమె సస్పెన్షన్ రద్దు చేయబడింది. బీజేపీకి జాతీయ కార్యనిర్వాహక అధికారిగా నామినేట్ అయ్యారు.
2005: శివరాజ్‌సింగ్‌పై తిరుగుబాటు, పార్టీ నుండి బహిష్కరణ
2011: తిరిగి బీజేపీలో చేరిక
2014: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పార్లమెంటరీ జిల్లా నుండి లోక్‌సభకు ఎన్నిక
2014: యూనియన్‌లోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో జలవనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవనానికి సంబంధించిన యూనియన్ కార్యదర్శిగా నియమితులయ్యారు.

- Advertisement -