బీజేపీ నేత ఉమాభారతికి కరోనా…

129
uma bharati

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారీన పడగా తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, సీనియర్‌ పార్టీ నేత ఉమాభారతికి కరోనా సోకింది.

ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఉమా భారతి. గత మూడు రోజులుగా కొద్దిపాటి జ్వరం ఉంది…ఎందుకైనా మంచిదని టెస్ట్‌ చేయించుకున్నాను. ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌ తేలిందన్నారు.

గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్‌ అయిన వారంతా వెంటనే పరీక్షలు చేయించుకోండి. టెస్టులు పూర్తయ్యే వరకూ ఎవరినీ కలవకుండా క్వారంటైన్‌ లో ఉండటం మంచిదని ఉమాభారతి పేర్కొన్నారు.