మరోసారి బీజెపీ సీనియర్లకు ఊరట..

206
- Advertisement -

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.  ఈ కేసు విషయంలో ఇప్పటికే భాజపా అగ్రనేత అడ్వాణీ, కేంద్రమంత్రి ఉమాభారతి, మరో భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషీలు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌ను లఖ్‌నవ్‌ సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. అయితే, ఆడ్వాణీ సహా ఆరుగురికి బెయిల్‌ మంజూరు చేయడంతోపాటు రోజువారీ విచారణకు హాజరుకానక్కరలేదంటూ కాస్త ఉపశమనం కలిగించింది.
  Advani, MM Joshi, Uma Bharti exempted from appearance in court
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి సీబీఐ ప్రత్యేక కోర్టు వీరికి వూరట కలిగించింది. విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి వారికి లఖ్‌‌నవ్ సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణకు వారి తరఫున న్యాయవాదులు హాజరైతే చాలని స్పష్టం చేసింది. గత నెల 30న ఈ కేసుకు సంబంధించి భాజపా అగ్రనేతలకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే వారిపై కేసు నమోదు చేయొద్దని దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌ను మాత్రం తిరస్కరించింది. ఈ కేసులో అడ్వాణీ సహా భాజపా నేతలపై కేసు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
  Advani, MM Joshi, Uma Bharti exempted from appearance in court
ఇప్పటికే బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అడ్వాణీ సహా భాజపా అగ్రనేతలపై కేసులను పునరుద్ధరించాల్సిందేనన్న సీబీఐ వాదనకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అంతేగాక లఖ్‌నవూ కోర్టులో రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది.

- Advertisement -