- Advertisement -
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది.తాజాగా ఈ వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్రం వైద్య,ఆరోగ్యశాఖ ధృవీకరించింది. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని, ఆ రెండూ కర్నాటకలో నమోదు అయినట్లు ఆయన చెప్పారు. జీనోమ్ పరీక్షల ద్వారా ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు ద్రువీకరించామన్నారు. కాగా,ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో ఇప్పటి వరకు 373 మందికి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు గుర్తించారన్నారు. 66,46 ఏళ్లు ఉన్న ఇద్దరికి ఒమైక్రా వేరియంట్ సోకిందని తెలిపారు.
- Advertisement -