- Advertisement -
వరుస ప్రాజెక్టులతో టాలీవుడ్ బ్యూటీ సమంత దూసుకుపోతుంది. ఒక పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ అయిపోయింది. అంతే కాదు ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా తన హవా కొనసాగిస్తోంది. తాజాగా సామ్ సోషల్ మీడియాలో ఓ అరుదైన రికార్డును సాధించింది. ఇన్ స్టా గ్రామ్‌లో 20 మిలియన్స్ ఫాలోవర్స్ మార్క్‌ను అందుకుంది ఈ బ్యూటీ.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘శాకుంతలం’ మూవీలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అలాగే..అల్లు అర్జున్ ‘పుష్ప’లో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుంది.. మరోవైపు కోలీవుడ్‌లో ఓ చిత్రం నటిస్తుండగా, హాలీవుడ్ ఓ సినిమా చేయనుంది.
- Advertisement -

