- Advertisement -
యుఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చింది ట్వీట్టర్. ట్రంప్ చేసిన రీ ట్వీట్‌లో తప్పుడు సమాచారం ఉండటంతో వెంటనే దానిని తొలగించింది ట్విట్టర్.కొవిడ్-19 కారణంగా మరణించిన వారిలో కేవలం 6 శాతం మంది మాత్రమే కరోనా కారణంగా మరణించినట్టు.. మిగతా 94 శాతం మంది వివిధ వ్యాధుల కారణంగా మరణించినట్టు సీడీసీ డేటాను అప్‌డేట్ చేసిందని ట్రంప్ మద్దతుదారుడు ట్వీట్ చేశాడు.
ఇదే ట్వీట్‌ను ట్రంప్ రీట్వీట్ చేశారు.దీంతో ఆ సమాచారంలో నిజం లేదని తేల్చిన ట్విట్టర్ ట్రంప్ చేసిన రీ ట్వీట్‌ని డిలీట్ చేసింది. సీడీసీ ఎలాంటి డేటా అప్ డేట్ చేయలేదని పేర్కొంది.
- Advertisement -