పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. ఈరోజును లిబరేషన్ డేగా ప్రకటించారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు.
భారత్‌పై తాము 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. చైనాపై 34 శాతం సుంకాలు ,యూఎస్‌కు దిగుమతయ్యే అన్నిదేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న సుంకాల వివరాలను పరిశీలిస్తే.. భారత్: 26 శాతం, చైనా: 34 శాతం,ఈయూ: 20 శాతం,తైవాన్: 32 శాతం,జపాన్: 24 శాతం,దక్షిణ కొరియా: 25 శాతం,థాయిలాండ్: 36 శాతం,స్విట్జర్లాండ్: 31 శాతం,ఇండోనేషియా: 32 శాతం ఉన్నాయి.
అలాగే మలేషియా: 24 శాతం,కంబోడియా: 49 శాతం, యూకే: 10 శాతం,దక్షిణాఫ్రికా: 30 శాతం,బ్రెజిల్: 10 శాతం,బంగ్లాదేశ్ 37 శాతం,సింగపూర్: 10 శాతం,ఇజ్రాయెల్: 17 శాతం,పిలిఫ్ఫీన్స్: 17 శాతం,చిలి: 10 శాతం,ఆస్ట్రేలియా: 10 శాతం,పాకిస్థాన్: 29 శాతం,టర్కీ: 10 శాతం,శ్రీలంక: 44 శాతం,కొలంబియా: 10 శాతం విధించారు.
Also Read:బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై కేసీఆర్ సమావేశం

