దసరా వేళ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆర్టీసీ

70
tsrtc
- Advertisement -

సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఈసారి కూడా ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. గతేడాదితో పోలిస్తే అదనంగా 1600 బస్సులు నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. 30 మందికి పైగా ప్రయాణికులు ఒకే రూట్ కు ప్రయాణించాలనుకుంటే.. కాల్ చేస్తే వాళ్ళ దగ్గరకే స్పెషల్ బస్సు వేస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

విద్యార్ధులు ఇప్పటికే వెళ్ళిపోగా… ఉద్యోగులు, ఇతర పనులు చేసుకునేవారు కూడా ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. బతుకమ్మలు ఆడేందుకు సిటీ నుంచి పెద్దఎత్తున ప్రయాణికులు గ్రామాలకు వెళ్తుండటంతో బస్టాండ్స్ లో రద్దీ కనిపిస్తోంది. కరోనా ఎఫెక్ట్ లేకపోవడంతో ఈసారి ఎక్కువమందే ఊళ్ళ బాట పట్టే ఛాన్స్ ఉంది. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సద్దుల బతుకమ్మ, దసరా పండగ కోసం… అక్టోబర్ 1 నుంచి 4 దాకా అదనపు బస్సులు వేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.  గత ఏడాది 3,636 ఆర్టీసీ బస్సులు నడిపితే…. ఈసారి 4,198 తిప్పనున్నట్లు చెప్పారు. ఎంజీబీఎస్ నుంచే కాకుండా..సిటీ నలుమూలల నుంచి కూడా బస్సులు రన్ చేస్తామన్నారు. జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్, మియాపూర్ నుంచి సైతం బస్సులు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేట్ లేదా సొంత వాహనాల్లో కాకుండా ఆర్టీసీలోనే సురక్షితంగా వెళ్ళాలని అధికారులు కోరుతున్నారు.

- Advertisement -