జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం:కేటీఆర్

262
ktr trs
- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్‌లో జర్నలిస్టు ఉద్యమనాయకుడు,ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్ ఉద్యమ సందర్భంగా జర్నలిస్టులు అందించిన సేవలు మరువలేనివన్నారు.

2004లో జర్నలిస్టు రామలింగారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని తెలిపారు.అనేకమంది జర్నలిస్టులకు సముచిత స్ధానం కల్పించి గౌరవించుకున్న ఘనత టీఆర్ఎస్‌దే అన్నారు. స్ధానికు సంస్థల నుండి ఢిల్లీ దాకా జర్నలిస్టులకు గుర్తింపు తెచ్చింది టీఆర్‌ఎస్ అన్నారు.

టీయూడ్యబ్లుజే అధ్యక్షుడిగా క్రాంతి కిరణ్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. జర్నలిస్టుల హౌసింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి చిత్తుశద్దితో శ్రీకారం చుట్టింది కేసీఆర్ సర్కారే అన్నారు. జర్నలిస్టుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటుచేశామని గర్తుచేశారు. విద్యార్థి ఉద్యమ నేతలను చట్టసభలకు పంపిన ఘనత టీఆర్ఎస్‌కే దక్కుతుందన్నారు.

తాను ప్రభుత్వంలో ఉన్న లేకపోయిన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదే అన్నారు. కేసీఆర్ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని చెప్పారు కేటీఆర్. ఆంధ్ర ప్రజలు తెలివైనవారని వారు చంద్రబాబుకు బుద్దిచెప్ప బోతున్నారని చెప్పారు. జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. ఇంకా కొన్ని పత్రికలు అవాస్తవాలను రాస్తు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు కేటీఆర్.తెలంగాణ వాదాన్ని,అస్తిత్వాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం ఇంకా జరుగుతోందన్నారు.

- Advertisement -