బీజేపీకి భయం.. కారణం అదే!

48
- Advertisement -

ప్రస్తుతం బీజేపీ కర్నాటక ఎలక్షన్స్ భయం పట్టుకుంది. వచ్చే నెల 10న కర్నాటక ఎన్నికలు జరుగుతుండడంతో ఈ ఎన్నికల్లో కన్నడిగుల తీర్పు ఎలా ఉండబోతుందో అని బీజేపీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. పైకి గంభీరంగా విజయం మాదే అని చెబుతున్నప్పటికి.. లోలోపల మాత్రం కాస్త టెన్షన్ గానే ఉన్నారు కమలనాథులు. ఎందుకంటే సౌత్ రాష్ట్రాలలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఒక్క కర్నాటకలోనే కాషాయ పార్టీ బలమైనదిగా ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం అధికారంలో కూడా ఉంది. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే అధికారం చేజారిపోవడంతో సౌత్ రాష్ట్రాలలో పార్టీ ప్రభావం శూన్యం అవుఃతుంది. అందుకే కర్నాటక ఎలక్షన్స్ విషయంలో కాషాయ పెద్దలు అంతర్మథనానికి లోనౌతున్నారు. .

ప్రస్తుతం కర్నాటకలో పరిస్థితులను గమనిస్తే కమలం పార్టీకి వ్యతిరేక గాలి బలంగానే విస్తోంది. ప్రస్తుతం సి‌ఎం గా ఉన్న బసవరాజ్ పై అవినీతి ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. దీనికి తోడు మాజీ సి‌ఎం యడ్యూరప్ప వర్గం నుంచి కూడా పార్టీకి వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. ఇక ఇదే టైమ్ లో కాంగ్రెస్ పార్టీ బలపడుతూ వస్తోంది. ప్రస్తుతం సర్వేలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగానే వస్తున్నాయి. దీంతో కన్నడికులు బీజేపీ షాక్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది కొందరి భావనా.

ఇక గత ముప్పై ఏళ్ల నుంచి కన్నడ ప్రజల తీర్పును గమనిస్తే ఏ పార్టీకి వరుసగా రెండవ సారి అధికారాన్ని కట్టబెట్టిన దాఖలాలు లేవు.. ఒకవేళ ఇదే సీన్ రిపీట్ అయితే ఈసారి ఎన్నికల తరువాత బీజేపీ ప్రతిపక్షనికి పరిమితం అవ్వడం ఖాయం. మరోవైపు ఈసారి కర్నాటక ఎలక్షన్స్ లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలతో పాటు ఆం ఆద్మీ పార్టీ, భారత రాష్ట్ర సమితి ( బి‌ఆర్‌ఎస్ ) వంటి పార్టీలు కూడా పోటీలో నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా బి‌ఆర్‌ఎస్ పోటీలో నిలిస్తే బీజేపీ ఓటు బ్యాంక్ లో చీలిక రావడం ఖాయం. అందుకే ఈసారి కర్నాటక ఎలక్షన్ విషయంలో కాషాయ పెద్దలు కాస్త భయానికి లోనౌతున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కాషాయ పార్టీ గెలుపు కోసం ఎలాంటి వ్యూహ రచనతో ముందుకు సాగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -