నేపియర్ వన్డే..కివీస్‌ను చిత్తుచేసిన భారత్

248
india vs new zealand
- Advertisement -

నేపియర్ వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కొల్పోయి 34.5 ఓవర్లలో చేదించింది. ఓపెనర్ దావన్,కోహ్లీ రాణించడంతో భారత్ గెలుపు బాటపట్టింది. ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులకే వెనుదిరిగిన ధావన్,కోహ్లి కలిసి లక్ష్యాన్ని పూర్తిచేశారు. ధావన్ 75 పరుగులుతో నాటౌట్‌గా నిలవగా కోహ్లీ 45 పరుగులతో రాణించారు.

Shami came back to remove Santner to start the slide.

అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు గట్టిషాకిచ్చారు భారత బౌలర్లు. మ్యాచ్ ఆరంభం నుండే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయ‌డంతో న్యూజిలాండ్‌కు ప‌రుగులు రావ‌డం కూడా క‌ష్ట‌మైంది. దీంతో 38 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాద‌వ్ (4/39), ష‌మీ (3/19) చాహ‌ల్‌ 2, జాద‌వ్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

కివీస్ బ్యాట్స్‌మ‌న్‌లో కెప్టెన్ విలియ‌మ్స‌న్ (64) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మ‌న్ ఎవరు సహకరించకపోవడంతో కివీస్ తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. కివీస్ టాప్ ఆర్డర్ వెన్నువిరిచిన షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు వన్డేలో సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

Dhawan stayed unbeaten on 75 as India completed an eight-wicket win.

- Advertisement -