స్టే ఇవ్వండి..హైకోర్టుకు సునీల్ కనుగోలు

32
- Advertisement -

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్న ఫిర్యాదుతో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీస్‌ను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. సునీల్‌తో పాటు ఆయన టీంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు.

ఇక ఈ నెల 30న విచారణకు రావాలని సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇవ్వగా హైకోర్టును ఆశ్రయించారు సునీల్. పది రోజుల సమయం కావాలని పోలీసులను కోరగా జనవరి 8వ తేదీ వరకు అనుమతిస్తూ ఒకే చెప్పారు పోలీసులు. అయితే ఇక సునీల్ వేసిన పిటిషన్ పై రేపు విచారణ జరపనుంది న్యాయస్థానం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -