బుకింగ్స్ లో జోరు చూపిస్తున్న ‘ఖుషి’

142
- Advertisement -

పవన్ కళ్యాణ్ క్రేజీ మూవీ ‘ఖుషి’ డిసెంబర్ 31 న థియేటర్స్ లో రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బుకింగ్స్ తాజాగా ఓపెన్ చేశారు. ఆల్ ఇండియాలో సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బుకింగ్స్ జోరందుకున్నాయి.

ఈ వారం అన్నీ చిన్న సినిమాలే కావడంతో మూవీ లవర్స్ అంతా ఖుషి చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో ఆన్లైన్ బుకింగ్స్ లో ఖుషి సందడి బాగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం థియేటర్స్ లో ఉన్న ధమాకా తో పాటు నిఖిల్ 18 పేజీస్ సినిమాపై కూడా ఖుషి ఎఫెక్ట్ పడనుంది. నిర్మాత ఖుషి వారం రోజుల పాటు థియేటర్స్ లో ఉంటుందని ఒక్క రోజు కాదని పదే పదే చెప్తున్నారు. ఇక పోకిరి, జల్సా రికార్డ్స్ ను ఖుషి తో బ్రేక్ చేయాలని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -