జుట్టు రాలిపోతోందా..ఈ చిట్కాలు మీకోసమే!

33
- Advertisement -

నేటి రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్యలలో జుట్టు సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. వెంట్రుకలు విపరీతంగా రాలిపోవడం, పలచబడడం, తెల్లజుట్టు ఏర్పడడం, చుండ్రు.. ఇలా చాలా సమస్యలే వేధిస్తున్నాయి. స్త్రీ పురుషుల తేడా లేకుండా చిన్నపిల్లల్లోనూ ఈ జుట్టు సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇ సమస్యలకు కారణం వాతావరణ కాలుష్యం ఒక కారణమైతే మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉందట. అందుకే జుట్టు సంరక్షణ కోసం మనం తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణదాన్యాలు, గుడ్లు, ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. .

ముఖ్యంగా ఐరన్, జింక్, విటమిన్ ఏ, డి.. వంటివి ఉండేలా చూసుకోవాలట. ఇక జుట్టు సంరక్షణలో మనం వాడే హెయిర్ అయిల్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి, బాదం, ఆలివ్, నూనెలను ఉపయోగించడం మంచిది. నూనెను కొద్దిగా వేడి చేసి జుట్టుకు రాసిన తరువాత ఒక 10-15 నిముషాల వరకు మసాజ్ చేసి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇక చేయడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలం పెంచుకొని జుట్టు రాలే సమస్య తగ్గుతుందట.

ఇక మనం వాడే రసాయనిక షాంపూలను సాధ్యమైనంత వరకు దూరంచేసి.. సహజసిద్దంగా కుంకుడుకాయ రసం వాడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక నేటి రోజుల్లో మహిళలు ఎక్కువగా కర్లింగ్, ఐరన్ వంటి హిట్ స్టైలింగ్ సాధనాలను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వాడకం వల్ల జుట్టు బలహీనపడే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వీటికి దూరంగా ఉండడమే మంచిది. జుట్టు సంరక్షణలో కలబంద రసం ఎంతో ప్రయోజనకారి. కలబంద జల్ ను తలకు అప్లై చేసి 40-60 మెల్లగా మర్ధన చేసి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసే జుట్టు ఆరోగ్యవంతంగా అందంగా తయారవుతుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు.

Also Read:TTD:అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

- Advertisement -