బెట్టింగ్ యాప్స్‌..పోలీస్ విచారణకు శ్యామల

12
- Advertisement -

బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల. పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. ఇప్పటికే ఈ కేసులో విష్ణు ప్రియ, రీతూ చౌదరి పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును శ్యామల ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శ్యామల దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు… ఆమెపై దాఖలు చేసిన కేసును క్వాష్ చేసేందుకు నిరాకరించింది.అదే సమయంలో ఆమెను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే సోమవారం (మార్చి 24) రోజున పంజాగుట్ట పోలీసుల ముందు హాజరు కావాలని శ్యామలను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు శ్యామల.

Also Read:థ్రిల్లింగ్‌గా రాబిన్ హుడ్ ట్రైలర్

- Advertisement -