బడ్జెట్ 2023..మంత్రి మండలి ఆమోదం

27
harishrao
- Advertisement -

రాష్ట్ర బడ్జెట్ 2023-24కి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరుగగా ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలో చర్చ జరిగింది. అనంతరం బడ్జెట్‌ని అమోదించారు.

ఈ నెల 6న(రేపు) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి హరీష్ రావు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజు 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఇక 8న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. అదే రోజు ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు సమాధానం చెప్పనున్నారు.

9, 10, 11 తేదీల్లో పద్దుల పైన చర్చ జరగనుంది. 12న సభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. అదే రోజు చర్చించి.. బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. దీంతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -