పెట్రో ధరల పెంపుపై చర్చించాలి: భట్టి

127
batti
- Advertisement -

పదిరోజుల పాటు ఈ నెల 26 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జరిగిన బీఏసీ సమావేశంలోలో తమ అభిప్రాయాలను వెల్లడించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. కేంద్ర వ్యవసాయ చట్టాలపై సభలో చర్చ జరిపి.. కేంద్రానికి లేఖ రాయాలని బీఏసీ సమావేశంలో కోరామన్నారు.దీంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలపై చర్చ జరపాలని , రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చర్చ జరగాలని కోరామన్నారు.

17న గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ‌, స‌మాధానం ఇవ్వ‌నున్నారు. 18వ తేదీన ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 20, 22 తేదీల్లో బ‌డ్జెట్‌పై సాధార‌ణ చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. 26వ తేదీన ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చించి ఆమోదించ‌నున్నారు.

- Advertisement -