ఇండస్ట్రీకి ఎలాంటి సాయమైన చేస్తాం:భట్టి

6
- Advertisement -

అందాల నటి అంజలి ‘గీతాంజలి’ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం “గీతాంజలి మళ్లీ వచ్చింది” చిత్రం మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శతక్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, సిద్దు జొన్నలగడ్డ గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, డైరెక్టర్ వశిష్ట గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

అంజలి మాట్లాడుతూ.. ‘నా 50వ సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థాంక్స్. మా గీతాంజలి సినిమాను ఎంతలా ఎంజాయ్ చేశారో.. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. మా సినిమాలో పని చేసిన నటీనటులందరికీ థాంక్స్. మా దర్శకుడు శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. మా కెమెరామెన్ సిద్దు వల్లే సినిమా చాలా బాగా వచ్చింది. మంచి క్వాలిటీతో సినిమాను తీశారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. శ్రీ జో లిరిక్స్ బాగున్నాయి. ప్రవీణ్ లక్కరాజు సంగీతం బాగా వచ్చింది. నా కోసం చేసిన మ్యాష్ అప్ చాలా నచ్చింది. కోన గారు చాలా మంచి వ్యక్తి. టాలెంటెడ్ పీపుల్స్ అందరినీ ఒక వద్దకు తీసుకొస్తారు. ఏప్రిల్ 11న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.

భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ.. ‘మిత్రులు కోన వెంకట్, పెద్దలు విజయేంద్ర ప్రసాద్, ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ నమస్కారాలు. తెలుగు పరిశ్రమకు మంచి విజయాలు రావాలని ఉగాది సందర్భంగా కోరుకుంటున్నాను. కోన గారు నాకు ఎన్నో ఏళ్ల నుంచి మిత్రులు. వ్యక్తిగతంగా, రాజకీయంగా మాకు ఎంతో అనుబంధం ఉంది. గీతాంజలి మళ్లీ వచ్చింది పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మధ్య తరగతి వాళ్లని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సాధనమే సినిమా. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది సినిమా పరిశ్రమ. ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీకి ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్దంగా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి అండగా నిలబడుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా ఎలాంటి సాయం అయినా చేసేందుకు సిద్దంగా ఉన్నాం. నన్ను ఈవెంట్‌కు పిలిచిన మిత్రులు కోన వెంకట్ గారికి థాంక్స్’ అని అన్నారు.

సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి పయనీర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గార్లతో స్టేజ్ మీద ఉండటం ఆనందంగా ఉంది. అంజలికి ఇది 50వ సినిమా. గీతాంజలి మళ్లీ వచ్చింది ఏప్రిల్ 11న రాబోతోంది. సీక్వెల్స్ హిట్ అవ్వదు అన్నోళ్లకి టిల్లు స్క్వేర్‌తో అట్లుంటది మనతోని అని చూపించాను. గీతాంజలి మళ్లీ వచ్చింది టీం కూడా చాటి చెబుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. కోనగారు చాలా మంచి వ్యక్తి. నా గెలుపుని తన గెలుపుగా భావించి సెలెబ్రేట్ చేశారు. కోన గారు లాంటి వ్యక్తితో నాకు పరిచయం ఉండటం అదృష్టం. ఆయనతో ఎప్పుడు కూర్చున్న సినిమా సంగతులెన్నో చెబుతుంటారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘భట్టి విక్రమార్క గారు నాకు 35 ఏళ్ల నుంచి తెలుసు. ఆయన ఎంతో కష్టపడ్డారు. సిద్దు చేసిన ఎల్‌బిడబ్ల్యూ చూసి వెంటనే ప్రెస్ మీట్ పెట్టాను. ఆ టైంలో సిద్దు ఎవరో, ఆ టీం మెంబర్స్ ఎవరో తెలీదు. మా ఈ స్టేజ్ మీదున్న ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. గీతాంజలి చిన్న కాన్సెప్ట్‌తో తీశాం. అది చాలా పెద్ద హిట్ అయింది. సీక్వెల్స్‌లో టిల్లు స్క్వేర్ రికార్డులు క్రియేట్ చేసింది. మా సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాం. అంజలికి ఇది 50వ సినిమా. మా చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. శివ నిర్వాణ, హరీష్ శంకర్, ప్రవీణ్ లక్కరాజు, శ్రీజో వంటి వారిని నేను పరిచయం చేశాను. ఇప్పుడు శివ తుర్లపాటి పరిచయం అవుతున్నారు. మా ఈవెంట్‌కు వచ్చిన సిద్దు, విజయేంద్ర ప్రసాద్ గారికి, విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్’ అని అన్నారు.

శివ తుర్లపాటి మాట్లాడుతూ.. ‘అంజలి గారికి ఇది 50వ సినిమా. మాకు ఒక్క సినిమా చేయడానికే ఎంతో కష్టంగా అనిపించింది. అంజలి గారు 50 సినిమాలు చేయడం చాలా గొప్ప విషయం. ప్రవీణ్ లక్కరాజు సంగీతం చాలా బాగా వచ్చింది. ఈ మూవీలో ఇంటర్వెల్, క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కోన గారి వల్లే మేం అంతా ఇక్కడ ఉన్నాం. మా అందరినీ నమ్మిన సినిమాను తీసిన కోన గారికి థాంక్స్. ఏప్రిల్ 11న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘తెలుగమ్మాయిగా అంజలి 50 సినిమాలు చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఓ సావిత్రి, వాణి శ్రీ గారిలా అఖండమైన కీర్తి పొందాలని కోరుకుంటున్నాను. కోన వెంకట్ గారిలా నేను వినోదాత్మకమైన కథలు, స్క్రిప్టులు రాయలేకపోతోన్నాను. అందుకే ఆయన నాకు శత్రువువంటి వారు (నవ్వుతూ). ఈ ఈవెంట్ చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా జరిగింది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

Also Read:Prabhas:’కల్కి’ వచ్చేది అప్పుడే?

- Advertisement -