- Advertisement -
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ డిసెంబర్ 8,2022 నుంచి భారత రాష్ట్ర సమితిగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్….కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన అధికారిక లేఖపై సంతకం చేశారు.
రాష్ట్ర విధాన పరిషత్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ నుండి బీఆర్‌ఎస్‌ఎల్పీగా మార్చుతూ రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ వీ నరసింహచార్యులు అమోదించారు. ఈమేరకు లేటర్ నెంబర్ 56/03/2018/PPS-2గా బులెటిన్ జారీ అయింది. ఇక నుంచి రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్‌ఎల్పీ నుండి బీఆర్ఎస్‌ఎల్పీ కార్యకాలాపాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈ నెల 14, బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి…
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది.. బీజేపీకి కేటీఆర్ ప్రశ్న
బీఆర్‌ఎస్‌తోనే దేశంలో గుణాత్మక మార్పులు
పవన్ ప్లాన్ కు.. అంబటి విల విల!
- Advertisement -