పవన్ ప్లాన్ కు.. అంబటి విల విల!

33
- Advertisement -

ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ మరియు జనసేన మద్య గత కొన్నాళ్లుగా రాజకీయ రగడ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు చేస్తోన్న విమర్శలు ఎప్పటికప్పుడు పోలిటికల్ హిట్ పెంచుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ పై విమర్శలు గుప్పించడంలో ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు. పవన్ పై అంబటి చేసే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. పవన్ చేసే జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర వంటి కార్యక్రమాలపై అంబటి చేసిన వ్యంగ్యస్త్రాలు అన్నీ ఇన్ని కావు. అయితే పవన్ కూడా అడపా దడపా అంబటి పై రివర్స్ కౌంటర్లు వేస్తున్నప్పటికి పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపలేదు ఇంతవరకు..

ఇదిలా ఉండగా పవన్ ఇటీవల సత్తెనపల్లిలో అంబటి టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ప్లేట్ తిరగబడిందనే చెప్పాలి. ఎవ్వరూ ఊహించని విధంగా సామాన్యుల నుంచి అంబటి లంచం తీసుకున్నాడనే ఆరోపణలను బలంగా ప్రస్తావించారు పవన్. దీంతో ఒక్కసారిగా పోలిటికల్ హిట్ రాజుకుంది. పవన్ వేసే ప్రతి అడుగుపై తనదైన రీతిలో విమర్శలు గుప్పించే అంబటి.. పవన్ చేసిన రివర్స్ అటాక్ తో ఒక్కసారిగా విలవియలాడుతున్నారని ఏపీ సర్కిల్స్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే పవన్ చేసిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని తాను ఎవరి వద్దనైనా లంచం తీసుకున్నాట్లు నిరూపిస్తే.. మంత్రి పదవికి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అంబటి సవాల్ విసిరారు.

దీంతో అంబటి లంచం అడిగిన భాదితులను ఏకంగా మీడియా ముందు ఉంచి అంబటి రాంబాబు కు షాక్ ఇచ్చారు జనసేన నేతలు. భాదితులు కూడా అంబటి లంచం అడిగిన మాట వాస్తవమేనని ఒప్పుకోవడం గమనార్హం. తమ కుటుంభ సభ్యుడు చనిపోయినందుకు ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందగా.. అందులో సగం 2.50 లక్షలు అంబటి రాంబాబు లంచం అడిగినట్లు భాదితులు మీడియా ముందు స్పష్టంగా చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోలు ఆడియో క్లిప్ లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అంబటి పరిస్థితి కక్కలేక మింగలేక అనట్లుగా తయారైంది. ఆధారాలు బయటపడడంతో అంబటి తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు జనసైనికులు. మొత్తానికి పవన్ పై వ్యంగ్యస్త్రాలు సంధించే అంబటి అవినీతిని బయటపెట్టి.. ఆయన నోటికి తాళం వేశారు పవన్.

ఇవి కూడా చదవండి…

కవిత ఫైర్.. అండగా నెటిజన్స్ !

6వ తరగతి నుంచే..’డిజిటల్ విప్లవం’!

తల్లీబిడ్డల క్షేమం కోసమే ఈ కిట్‌:హరీశ్‌

- Advertisement -