టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం…

96
kcr
- Advertisement -

ఇవాళ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. పార్టీ ఆవిర్భవించిన 21 సంవత్సరాల తరువాత జాతీయ పార్టీగా రూపాంతరం చెందనుండటంతో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.

తెలంగాణ భవన్ లో జరిగే సర్వసభ్య సమావేశంలో పేరుమార్పుపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారు. మధ్యాహ్నం 1.19 గంటలకు తీర్మానంపై కేసీఆర్ సంతకం చేస్తారు. సభ్యులు ఆమోదించిన తీర్మానంపై కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.

టీఆర్ఎస్ స్థానంలో ఏర్పాటయ్యే పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా కేసీఆర్ ఖరారు చేశారు. దాదాపుగా వందకుపైగా పేర్లను పరిశీలించిన అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్ కూడా హాజరు కానున్నారు.

- Advertisement -