లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన..

195
loksabha
- Advertisement -

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టారు టీఆర్ఎస్ ఎంపీలు. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేయగా పోడియం ద‌గ్గ‌ర‌కు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు.

ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం త‌మ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో టీఆర్ఎస్ స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో స్పీక‌ర్ బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

- Advertisement -