టీటీడీలో ఆయన లేనిలోటు తీర్చలేనిది: ఇంద్రకరణ్

120
Minister Indrakaran Reddy
- Advertisement -

ఇవాళ ఉదయం గుండెపోటుతో డాలర్ శేషాద్రి మృతిచెందిన సంగతి తెలిసిందే. కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లిన శేషాద్రికి తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. దీంతో దవాఖానకు తరలించేలోపే తుదిశ్వాస విడిచారు.

డాలర్ శేషాద్రి హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శేషాద్రి తన తుది శ్వాస వరకు స్వామి వారి సేవలో తరించారని, టీటీడీలో ఆయన లేనిలోటు తీర్చలేనిదన్నారు.

1978 నుంచి డాలరు శేషాద్రి శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. 2007లో పదవీ విరమణ చేశారు. శేషాద్రి సేవలను గుర్తించిన టీటీడీ.. ఆయనను ఓఎస్డీగా కొనసాగిస్తోంది.

- Advertisement -