సోనూ సూద్‌కు ఎంపీ సంతోష్ అభినందనలు..

177
trs mp

సినీ నటుడు సోనూ సూద్‌కు అభినందలు తెలిపారు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటినందుకు సోనూకు థ్యాంక్స్ చెప్పిన సంతోష్‌ అలాగే ఐక్యరాజ్యసమితి అవార్డు రావడం పట్ల అభినందనలు తెలిపారు.

కరోనా వైరస్ భారతదేశాన్ని చుట్టుముట్టినప్పుడు దేశ ప్రజలెంతో మంది ఎన్నో రకాలు కష్టాలు పడ్డారు. ఎన్నో విధాలుగా అవస్థలు పడ్డారు. ప్రజల ఆకలి తీర్చేందుకు, వారి కష్టాలను పోగొట్టేందుకు తనవంతు సాయాన్ని అందించారు సోనూ.

ఈ నేపథ్యంలో సోనూసూద్‌కు ఐక్యరాజ్య సమితి అవార్డు వరించింది. ఐరాస అనుబంధ సంస్థ యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఆయనకు ‘ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డు’ను ప్రకటించింది.