విజయ్ దేవరకొండ @ 9 మిలియన్స్

265
vijay devarakonda

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు విజ‌య్.

ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ ఫాలోయింగ్ రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. తాజాగా 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సంపాదించుకుని దక్షిణాదిలో ఇన్‌స్టాలో 9 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా నిలిచారు విజయ్‌.

2018 మార్చి 7న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతాని ప్రారంభించారు. త‌క్కువ వ్యవధిలోనే 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకోవ‌డం ఓ రికార్డుగా చెబుతున్నారు.

ప్రస్తుతం విజ‌య్ …. పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో ఫైట‌ర్‌ చిత్రం చేస్తుండగా ద‌క్షిణాది హీరోల్లో ఎవ‌రికీ సాధ్యం కానీ సరికొత్త రికార్డును విజయ్‌ చేరుకోవడంపై అభిమానులు తెగసంబరపడిపోతున్నారు.