శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

77
kavitha
- Advertisement -

అంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మల్లిఖార్జున స్వామిన దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలసి కవిత మీడియాతో మాట్లాడారు.

మల్లిఖార్జున స్వామిని భ్రమరాంభ అమ్మవారిని ఎన్నిసార్లు చూసిన తనివి తీరదన్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి దయ వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు ప్రజలందరూ బాగుండాలని ప్రార్థించానని తెలిపారు.

 

- Advertisement -