ఉక్రెయిన్‌ వార్‌పై మోదీ సూచన…స్పందించిన పుతిన్‌

212
modi putin
- Advertisement -

ప్రస్తుత యుగం యుద్దాల కాలం కాదంటూ ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచన చేశారు. దీనిపై తాజాగా రష్యా స్పందించింది. పశ్చిమ దేశాలు ఈ విషయాన్ని తమకు నచ్చినట్టుగా మార్చుకుంటున్నారని వ్యాఖ్యానించింది. పశ్చిమ దేశాలు అసలు విషయాన్ని పక్కన పెట్టి తమకు కావాల్సిన వాక్యాన్ని నచ్చినట్టుగా అన్వయించుకుంటాయి అని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్‌ అన్నారు.

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరైన మోదీ పుతిన్‌ తో విడిగా భేటీ ఆయ్యారు. ఆ సమయంలో పుతిన్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుత యుగం యుద్దాలది కాదని ఆయనకు సూచించారు. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం, ఆహార ఇంధన సంక్షోభాలను ఎదుర్కోనే పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఆయన పిలుపునుకు సానుకూలంగా స్పందించిన పుతిన్‌ సాధ్యమైనంత త్వరగా యుద్దాన్ని ముగిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇదిలా ఉంటే మోదీ సూచను అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ప్రశంసిస్తున్నాయి. యుద్దాన్ని ఆపే శక్తి కేవలం మోదీకి మాత్రమే ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నాయి.

- Advertisement -