వాడవాడలా గులాబీ జెండా పండగ..

138
trs

గులాబీ జెండా పండగ వాడవాడలా ఘనంగా జరుగుతోంది. ఇక ఇవాళ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనుండగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నేత పర్యాద కృష్ణమూర్తి గులాబీ జెండాను ఎగుర వేయగా పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీక్షణం ప్రజాహితం కోసం పరితపించే వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాల్లో వార్డు వార్డునా టీఆర్‌ఎస్‌ నేతలు గులాబీ జెండాను ఎగుర వేసి జెండాపండుగను ఘనంగా నిర్వహించారు.

వరంగల్‌ జిల్లాలో టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా జరిగింది. టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉత్సాహంగా గులాబీ జెండాలను ఆవిష్కరించారు. నర్సంపేట పట్టణంలో టీఆర్ఎస్ జెండా జెండాను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎగురవేశారు. టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.