రాష్ట్రంలో ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోరు జరుగుతుంది. ఇప్పటికే తొలి విడత ఎన్నికలు పూర్తి కాగా నేడు రెండవ విడత ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీలను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది టీఆర్ఎస్. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా వరకూ జెడ్పీ అభ్యర్దులను ఖరారు చేశారు గులాబీ బాస్. ఈనెల 14న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 14న ముగియనుండటంతో 27న ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం ఎంపీపీ, జెడ్పీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికల తేదీని ప్రకటిస్తుంది. నోటికేషన్ జారీ కాగానే జెడ్పీ చైర్మన్ అభ్యర్దులను ప్రకటించనుంది టీఆర్ఎస్.
పార్టీ కోసం కష్టపడిన వారికి , పార్టీలోని ముఖ్య నేతలకు జెడ్పీ పదవులను ఇవ్వనున్నారు. కొన్ని స్ధానాల్లో ఇప్పటికే జెడ్పీ చైర్మన్ అభ్యర్దులను ఖారారు చేశారు గులాబీ అధినేత. అన్ని జెడ్పీ స్ధానాల్లో ముందుగానే చైర్ పర్సన్ అభ్యర్ధులను ప్రకటించడం వల్ల రాజకీయంగా సొంత పార్టీలోనే పోటీ ఏర్పడుతుందని భావించింది టీఆర్ఎస్ అధిష్టానం. ఇందుకోసం ఎన్నిక సమయంలోనే చైర్ పర్సన్ అభ్యర్దులను ప్రకటించనున్నారు. కొన్ని స్ధానాల్లో ఫైనల్ చేసిన జెడ్పీ అభ్యర్లులు వీరే…
అసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ కి అవకాశం ఇచ్చారు. ఇక పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇటివలే జరిగిన పార్టీ మీటింగ్ లో వీరిద్దరి పేర్లు ప్రకటించారు. మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ గా చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు భార్య భాగ్యలక్ష్మీకి అవకాశం ఇచ్చారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బండ నరేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ పదవిని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్‌రావుకు ఇవ్వనున్నట్లు కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే విఠల్‌రావు జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పదవిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భార్య జ్యోతికి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.