ఆ ముగ్గురు జంపింగ్ లకు మంత్రి పదవులు ఖరారు చేసిన సీఎం

224
Kcr
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండో సారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయనతో పాటు హోం మంత్రిగా మహమ్మద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 10వ తేదిన 11మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. అయితే తెలంగాణలో ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో ఎవరికి వరిస్తాయో అని ఆసక్తిగా నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారనే వార్త ప్రస్తుతం తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. మంత్రి పదవుల కోసం అధిష్టాన దూతల వద్దకు పరుగులు తీస్తున్నారు ఆశావాహులు. ఇక ఆరు మంత్రి పదవులు మిగలడంతో అందులో రెండు మహిళలకు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు టీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి బెర్త్ ఖారారు అయినట్టు తెలుస్తుంది. మరోవైపు ఆరు మంత్రి పదవుల్లో మూడు ఇతర పార్టీల నుంచి వచ్చి న వారికి కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు గెలవగాఅందులో 13మంది ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 13మందిలో ఇద్దిరిక మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తుంది. అందులో మహేశ్వరం ఎమ్మెల్యే , మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లకు బెర్త్ ఖరారు అయినట్టు సమాచారం.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ కేబినెట్‌లో స‌బిత హోం మంత్రిగా ఉంటే… గండ్ర చీఫ్ విప్‌గా ఉన్నారు. ఇక టీడీపీ నుంచి ఇద్దరూ గెలవగా అందులో ఒకరు ఆ పార్టీకీ రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. సత్తుపల్లి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినా సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి పదవి దక్కనుందని తెలుస్తుంది. ఎస్సీ సామాజిక‌వ‌ర్గం కోటాలో సండ్ర‌కే ఛాన్స్ ఉంది. ఇక మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు సైతం సండ్ర వైపే మొగ్గు చూప‌డంతో కేసీఆర్ ఆయ‌న‌కే కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తార‌ని తెలుస్తోంది. మే 23 తర్వాత ఎలాంటి పరిస్ధితులు నెలకొంటాయో చూడాలి మరి.

- Advertisement -