“మహర్షి” పవర్ పుల్ పంచ్ డైలాగ్స్ ఇవే..

647
maharshi
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అనే నేను సినిమా తర్వాత నటించిన చిత్రం మహర్షి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈమూవీ లో మహేశ్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటించగా..అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపంచారు. దిల్ రాజు, అశ్వినిదత్, పీవీపీలు నిర్మించిన ఈమూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రిమియర్ షో నుంచే ఈ మూవీ మంచి టాక్ తో దూసుకెళ్తుంది. ఈమూవీలో మహేశ్ మూడు వెరైటి పాత్రలో కనిపించారు. రైతు సమస్యలపై ఈసినిమా తీసినట్టుగా తెలుస్తుంది. ఇక మహేశ్ పొలాల్లో నాటు వేస్తున్న సీన్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మాస్, క్లాస్ , ఫ్యామిలీ అన్ని రకాల ప్రేక్షకులను అలరించిందిని చెప్పుకోవాలి. ఈ మూవీలో మహేష్ బాబు కొట్టిన కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ మీకోసం…

* ఏలేద్దామనుకుంటున్నాను సార్ … ప్రపంచాన్ని ఏలేద్దామనుకుం టున్నాను.

* రెండు సబ్జక్ట్స్ కే చనిపోతావా ? ఎవడి బలం వాడిదే … నీ బలం ఏంటో తెలుసుకో దీనెమ్మ జీవితం నీ కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది

* ఏంటో గాల్లో ఆక్సిజన్ తగ్గినట్టు మనుష్యుల్లో హ్యూమానిటీ తగ్గిపోతుంది

* రిషి నేను హుస్సేన్ బోల్టు ను చూసేసాను … నిన్ను చూడాలనుకుంటున్నాను … పరిగెత్తు రిషి … ఆగకుండా

* సార్ మీరు ఇంగ్లీష్ దొర లాగా ఉంటారు… పల్లెటూళ్ళో ఎండలు ఎక్కువ జాగ్రత్త.

* ఇప్పటి వరకూ నువ్వేమనుకున్నావో అది చేశావు… ఇప్పుడు నీ మనసేం చెప్తే అది చేయ్‌… నువ్వు గెలుస్తావు రిషి

* అలాంటోడు మన జీవితంలో ఉండాలంటే అదృష్ఠం ఉండాలి సార్ … మరి మీకు ఆ అదృష్ఠం ఉందా ?

*ఈడెవడో సూటు వేసుకున్న శకునిలాగా వున్నాడే ?

*ఒకసారి ఏసి రూములో కూర్చుని కుదరదన్నావ్… చెట్టు క్రింద కొచ్చావ్… ఇప్పుడు కాదంటే ఎక్కడికి పోతావో ఆలోచించుకో వివేక్

*భారతదేశాన్ని రాజకీయ నాయకులు పాలిస్తారనుకుంటారు … కానీ కార్పొరేట్ కంపెనీలే పాలిస్తారు.

* ఓడిపోతామన్న భయంతో ఆటమొదలెడితే … ఆటలో ఎప్పుడూ గెలవం. చెప్పా కదా ఆఖరు పేజిలో నా ఫోన్ నెంబరు ఉంది… కాల్ చెయ్యండి.

*ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు… మరి రైతు ఏడిస్తే దేశానికి మంచిదా ?

*సాఫ్టువేర్ అన్నారు కదరా ?

* నాకొడుకయ్యా ఈ భూమి నాదనేది… ఇది నా భూమి…. నాది… ఎవ్వడైనా లాక్కోవాలని చూస్తే …

* రైతును కాపాడడం ప్రభుత్వ భాధ్యతే కాదు… మనందరిదీ … మనలోని ప్రతి వాళ్ళది.

- Advertisement -