నితిన్ కు భారీ హిట్లు ఇచ్చిన గురు, శిష్యులు

167
nithiin-trivikram

యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ సినిమా విజయం సాధించింది. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్లను రాబుడుతుంది. రష్మీక మందన హీరోయిన్ గా నటించిన ఈచిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. కాగా భీష్మకు ముందు నితిన్ నటించిన మూడు సినిమాలు నిరాశపరిచాయి. లై, ఛల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో సంవత్సరం గ్యాప్ తర్వాత భీష్మ మూవీలో నటించారు నితిన్. అ ఆ మూవీ తర్వాత భీష్మ మంచి విజయం సాధించింది.

bheeshma

అ ఆ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా భీష్మ మూవీకి త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. తొలిరోజే ఈ చిత్రం 7.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అప్పుడు త్రివిక్రమ్ వచ్చి నితిన్ కెరీర్‌కు బ్రేక్ ఇస్తే.. ఇప్పుడు ఆయన శిష్యుడు వెంకీ కుడుముల వచ్చి మరో హిట్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వత నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే మూవీలో నటించనున్నారు.