బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం..

9
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో విషాదం చోటు చేసుకుంది. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 6 గురు ప్రయాణీకులు మరణించగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనతో రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

రైలు ప్రమాద ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎం, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయంకోసం ఘటన స్థలానికి చేరుకున్నాయి. బెంగాల్ లో రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. రైలు ప్రమాదం స్థలివద్ద యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Also Read:Puhspa 2:పుష్ప 2..వాయిదానేనా?

- Advertisement -