277 మంది దుర్మరణం.. రైలు ప్రమాదానికి కారణం అదే !

36
- Advertisement -

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు గూడ్స్ రైలు, కోరమండల్, యశ్వంత్ పూర్ ట్రైన్ లు ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 277 మంది దుర్మరణం చెందగా.. 1000 మందికి పైగా క్షత్రగాత్రులయ్యారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందట. సమాచార లోపం వల్ల ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ను అదే పట్టాలపై వస్తున్న కోరమండల్ ట్రైన్ ఢీ కొట్టడం, మరో పట్టాలపై వెళ్తున్న యశ్వంత్ పూర్ ట్రైన్ ను కూడా ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ దశాబ్ది కాలంలో ఇదే అతిపెద్ద రైలు ప్రమాదంగా చెబుతున్నారు.

Also Read: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు.. జూన్3 రైతు దినోత్సవం

ఘటన స్థలంలో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. NDRF, ODRAF, ఫైర్ సర్వీసెస్, ఆర్మీ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక ఈ ఘోర రైలు ప్రమాదంతో ఘటన స్థలం ఆర్తనాదలతో మరుమ్రోగుతోంది. ఎటు చూసిన గుట్టలు గుట్టలుగా శవాలు దర్శనమిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో నేడు సంతాప దినంగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. రైలు ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అయితే ట్రైన్ ప్రమాదం జరగడంపై కవచ్ టెక్నాలజీ ఏమైందని సోషల్ మీడియాలో నెటిజన్స్ మండి పడుతున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ఒకే ట్రాక్ పై రెండు ట్రైన్లు వస్తే 700 మీటర్ల దూరంలోనే ఆటోమాటిక్ గా బ్రేకులు పడతాయి. మరి ఈ కోరమండల్ ప్రమాదంలో కవచ్ టెక్నాలజీ ఫెయిల్ అయిందనే విమర్శలు వెల్లువెత్తునున్నాయి.

Also Read: విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు:అశ్వినీ వైష్ణవ్

- Advertisement -