హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం: చంద్రబాబు

16
- Advertisement -

భారత్‌లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దావోస్‌లో సీఐఐ నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందన్నారు. ఇంటర్నెట్, ఆర్థిక సంస్కరణలను వినియోగించి రెండో తరం సంస్కరణలు ప్రవేశపెట్టాను అన్నారు చంద్రబాబు.

మీ అందర్నీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగిందని… భవిష్యత్‌లో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగిందన్నారు. ప్రతి సారీ తప్పకుండా దావోస్ వస్తున్నా. గ్లోబల్ గా వస్తున్న కొత్త డెవలప్మెంట్స్ ఏంటి , వాటిని ఎలా అందిపుచ్చుకోవాలి లాంటివి ఇక్కడ నేర్చుకుంటున్నా అన్నారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్ అంటే, ఇదో పెద్ద లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకుంటారు. కానీ, చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు తెలిసిన మా లాంటి వాళ్ళకి ఇది ఆశ్చర్యం ఏమి కాదు అన్నారు టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్.హైదరాబాద్ ఈ రోజు ఇలా అభివృద్ధి చెందటానికి కారణం నాడు చంద్రబాబు విజన్. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందన్నారు.

Also Read:పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్

- Advertisement -