విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు:అశ్వినీ వైష్ణవ్

43
- Advertisement -

ఒడిశాలోని బాలాసోర్‌ దగ్గరలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన..సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అన్నారు.

రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం. ప్రమాద ఘటనపై విచారణ చేసి మరిన్ని వివరాలు చెబుతామని జాతీయ మీడియాకు తెలిపారు. విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. మృతులు కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షలు, స్వల్ఫంగా గాయపడిన వారికి రూ.50వేల అర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also Read: CM KCR:దేశానికే తలమానికంగా తెలంగాణ అభివృద్ధి

రాత్రి 7గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో దాదాపుగా 238కి మందికిపైగా మరణించారు. 900కి పైగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెలికాప్టర్‌లు, 200 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయని ఒడిశా సీఎస్ తెలిపారు.

Also Read: CEC:ఎన్నికల వేళ ఐదు రాష్ట్రాల్లో పారదర్శక బదిలీలు…

- Advertisement -