రేపు విజయనిర్మల అంత్యక్రియలు

462
vijayanirmala
- Advertisement -

ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల సినీ,రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తు చేస్తు విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇక విజయనిర్మల భౌతికకాయాన్ని అభిమానులు,బంధువల సందర్శనార్థం నానక్ రాంగూడలోని నివాసంలో ఉంచారు. రేపు చిలుకూరు లోని ఫామ్ హౌస్ లో విజయనిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి.

గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. విజయనిర్మల తండ్రిది స్వస్థలం చెన్నై కాగా, తల్లిది గుంటూరు జిల్లా నరసరావుపేట. తన మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు విజయనిర్మల.

- Advertisement -