సీనియర్ నటుడు వినోద్ మృతి..

201
tollywood viond

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు వినోద్ హఠన్మారణం చెందారు. బ్రెయిన్ స్టోక్‌తో ఇవాళ ఉదయం 3 గంటలకు మృతి చెందారు. హీరోగా సినీ కెరీర్‌ మొదలుపెట్టిన వినోద్..విలన్‌గా,క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా 300కి పైగా సినిమాల్లో నటించారు. చంటి సినిమాలతో తన నటనకు మంచి గుర్తింపు లభించింది.

వినోద్ అస‌లు పేరు అరిశెట్టి నాగేశ్వ‌ర‌రావు. వినోద్‌కు భార్య వీనావతి, పిల్లలు శిరీష, సురేష్‌, తేజస్విలు ఉన్నారు. త‌మిళ సినిమాలతో పాటు నాలుగు హిందీ సినిమాలు సీరియల్స్‌లోనూ నటించారు. వినోద్ మృతితో టాలీవుడ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. లారీ డ్రైవర్, చంటి, నరసింహనాయుడు,ఇంద్ర, చంటి తదితర చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఫ్యాక్షన్‌ సినిమాల్లో విలన్‌ అంటే ఇలా ఉండాలని అనేలా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.