కరోనా ప్రభావంతో మార్కెట్లకు ఎదురుదెబ్బ..

72

2022లో తొలి మూడు సెషన్లు లాభాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈరోజు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాదిలో తొలిసారి నష్టాలను చవిచూశాయి. కరోనా కేసులు భారీగా పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 621 పాయింట్లు నష్టపోయి 59,601కి పడిపోయింది. నిఫ్టీ 179 పాయింట్లు కోల్పోయి 17,745 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.74%), భారతి ఎయిర్ టెల్ (1.64%), మారుతి (1.13%), బజాజ్ ఫైనాన్స్ (0.67%), టైటాన్ (0.58%).

టాప్ లూజర్స్: అల్ట్రాటెక్ సిమెంట్ (-2.58%), టెక్ మహీంద్రా (-2.42%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.01%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.01%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.87%).