సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డు వివాదం

4
- Advertisement -

తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకు ముదురు తుంది, నెయ్యి కల్తీ, విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియో గాలు ఇటు ఆంధ్రప్రదేశ్ తోపాటు అటు దేశవ్యా ప్తంగా దుమారం రేపుతు న్నాయి.

దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ రాజకీయ నేతలు, ఆధ్యాత్మికవేత్తలు, పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు, సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది..

ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వివాదం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది.. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టుకు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.

BJP నేత సుబ్రహ్మణ్య స్వామి, YCP నేత వైవీ సబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్య లపై విచారణ చేయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీనిపై విచారణ జరగాలని కోరారు. విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిల్‌ దాఖలు చేశారు.

తిరుమల లడ్డూ వ్యవహారంలో విచారణ కోరుతూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ చేయించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.

Also Read:పోలీస్ అధికారులకు హరీశ్‌..స్ట్రాంగ్ వార్నింగ్

- Advertisement -