- Advertisement -
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు మూడు రోజులు సెలవులు ప్రకటించింది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. రాబోయే మూడు రోజులు పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు పాటు విద్యా సంస్థలకు సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులు ప్రకటిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల రక్షణ సహాయ చర్యల గురించి మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
- Advertisement -