ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్థరాత్రి 12 గంటలకు పీసీఆర్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
బెదిరింపు కాల్స్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేజ్రీవాల్‌ను చంపేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాల్ చేసిన వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నారని..ప్రస్తుతం అతను ఢిల్లీలోని గులాబీ బాగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
సోమవారం అర్థరాత్రి 12.05 గంటలకు పీసీఆర్ కాల్ చేసి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కాల్ తర్వాత ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి అతడిని గుర్తించారు. ప్రస్తుతం కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి..