చిరు గుడ్ న్యూస్

69
- Advertisement -

టాలీవుడ్ లో ఎక్కడ చూసిన తారకరత్న ఆరోగ్యం గురించే హాట్ హాట్ డిస్కషన్ నడుస్తుంది. అభిమానులు కూడా తారకరత్న ఆరోగ్యం గురించి సరైన అప్ డేట్ ఎవరిస్తారా ? అంటూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూర్ హాస్పిటల్ కి వెళ్ళిన కొందరు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్నారు. తాజాగా మెగా స్టార్ చిరు కూడా తారకరత్న హెల్త్ గురించి అప్ డేట్ ఇచ్చారు.

“సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. ” అంటూ చిరు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నందమూరి అభిమానులకు శుభ వార్త చెప్పారు. అంటూ చిరు ట్వీట్ చేసి నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.

పొలిటికల్ గా కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి చర్చనీయాంశం అవుతోంది. ఓ వైపు నారా లోకేష్ యువ గళం అంటూ యాత్ర మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తారకరత్న ఇలా హాస్పిటల్ పాలవ్వడం తెదేపా నాయకులను, శ్రేణులకులను భాదిస్తుంది. ఏదేమైనా త్వరలోనే తారకరత్న పూర్తిగా కొలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -