ఈ సంక్రాంతి ‘శృతి’ దే !

43
- Advertisement -

సంక్రాంతి పండుగకి తమ సినిమా రిలీజ్ అంటే ఏ స్టార్ కైనా భలే కిక్ ఉంటుంది. అదే స్టార్ నుండి రెండు సినిమాలు అంటే ఆ సంతోషం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే సంతోషంలో ఉప్పొంగుతుంది శృతి హాసన్. ఇటు బాలయ్య అటు చిరు లతో సంక్రాంతికి రిలీజ్ కానున్న రెండు సినిమాల్లో శృతి హీరోయిన్ గా కనిపించనుంది .

నిన్న వీర సింహా రెడ్డి ఈవెంట్ లో మెరిసిన శృతి హాసన్ , రేపు వాల్తేరు వీరయ్య ఈవెంట్ లో కనిపించనుంది. ఈ రెండు సినిమాలతో శృతి సంక్రాంతి సందడి చేసుకుంటుంది. రిలీజ్ తర్వాత అటు చిరు ఇటు బాలయ్య పక్కన పోస్టర్స్ లో కనిపిస్తూ ఇరు సినిమాలలో తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేయనుంది.

గతంలో రాధా, రాధిక, విజయ శాంతి బాలయ్య, చిరులతో ఓకే సారి సినిమాలు చేశారు. ఇక సిమ్రాన్ కూడా సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు హీరోలతో కలిసి నటించింది. ఆ తర్వాత ఇలా సంక్రాంతికి రెండు సినిమాల్లో ఇద్దరితో నటించే ఛాన్స్ శృతికే దక్కింది. ఏదేమైనా రెండు సినిమాలతో సంక్రాంతి అంతా శృతిదే కాబోతుంది. మరి శృతి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

నిరాశపరిచిన బాహుబలి ఎపిసోడ్స్

నాగబాబు V/s రోజా… మాటల యుద్ధం

చెమటలు పట్టిస్తున్న మీరాజాస్మిన్‌

- Advertisement -