ప్లాప్ కాంబినేషన్.. హిట్ స్క్రిప్ట్

46
- Advertisement -

సంపత్ నంది – హీరో గోపీచంద్ సినిమా ఫిక్స్ అయ్యింది. కానీ, సినిమా మాత్రం ముందుకు కదలడం లేదు. సాధారణంగా ఇలాంటి ప్లాప్ కాంబినేషన్ లో సినిమా సెట్ అయినప్పుడు స్పీడ్ గా షూటింగ్ జరగదు. అగుతు సాగుతూ ఉంటుంది. దీనికితోడు అభిమానులు కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా గోపీచంద్ అభిమానులు ఈ విషయంలో ముందుంటారు. అందుకే ఈ సినిమా పై ఇప్పటికే బోలెడు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

సంపత్ నంది – గోపీచంద్ సినిమా ఓ దశలో ఆగిపోయిందని ప్రచారం కూడా మొదలైంది. ఐతే, తాజా అప్ డేట్ ప్రకారం..గోపీచంద్ త్వరలోనే సంపత్ నంది సినిమా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నాడు. వచ్చే వారంలో సంపత్ నంది… గోపీచంద్ ని కలిసి షూటింగ్ డేట్స్ గురించి మాట్లాడి.. షెడ్యూల్ ను ఫైనల్ చేయనున్నాడు. ఆ తర్వాత సినిమా పై వరుస అప్డేట్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు దర్శకుడు సంపత్ నంది టీమ్ పోస్టర్లను కూడా రెడీ చేస్తోంది.

వరుస పరాజయాల దెబ్బకు ఇటు గోపీచంద్ – అటు సంపత్ నంది కసి మీద ఉన్నారు. అందుకే.. గోపీచంద్ సినిమా విషయంలో సంపత్ నంది పెన్ను రోజుకు మరో నాలుగు గంటలు ఎక్కువ పని చేస్తోంది. పైగా ఈ సినిమాకి సంబంధించి వీలు చూసుకుని మరీ అన్ని పనులు తానే స్వయంగా చక్కబెట్టుకుంటున్నాడు సంపత్ నంది. ఈ సారి స్క్రిప్ట్ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సంపత్ నంది ప్లాన్ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి…

దూసుకుపోతున్న ‘వీరసింహారెడ్డి’

చెమటలు పట్టిస్తున్న మీరాజాస్మిన్‌

అలియా అది చూపించలేనంటోంది

- Advertisement -