ఎగ్జిట్ పోల్స్ : సంచలనం.. విజయం ఆ పార్టీదే !

56
- Advertisement -

గత కొన్నాళ్లుగా దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొల్పిన కర్నాటక ఎన్నికలు ఎట్టకేలకు నేటితో ముగిసిపోయాయి. ప్రధాన పార్టీల హోర హోరీ ప్రచారాలు, పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షో లతో గత పది రోజులుగా కన్నడ రాజకీయాలు అట్టుడికిపోగా.. పార్టీల భవిష్యత్ నిర్ణయించే ఓటర్లు నేటితో ఫలితాన్ని డిసైడ్ చేసేశారు. మొత్తానికి ఓటింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై పడింది. కర్నాటక జెండా పాతేదీ ఎవరు ? కన్నడిగులు ఎవరికి అధికారాన్ని ఇవ్వబోతున్నారు ? ఏ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారు ? ఇలాంటి ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది. అయితే ఎన్నికలు ముగిసిన తరువాత సాయత్రానికి అధికారాన్ని అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన ఫలితాల ఆధారంగానే 50 శాతం ప్రభుత్వాన్ని అంచనా వేయవచ్చు. ఆ విధంగా కర్నాటక ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏ ఏ సర్వేలు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టయో ఒకసారి చూద్దాం !

  • ఇండియా టుడే ( 160 / 224 ) : కాంగ్రెస్ -92, బిజెపి – 64, జేడీఎస్ – 4,
  • జీ మ్యాట్రిజ్ : కాంగ్రెస్ 103-113,బీజేపీ 79-94, జేడీఎస్ 25-33
  • న్యూస్ నేషన్ : కాంగ్రెస్ 86, బీజేపీ 114, జేడీఎస్ 21, ఇతరులు 3
  • టైమ్స్ నౌ : కాంగ్రెస్ 106-120, బీజేపీ 78-92, జేడీఎస్ 20-26, ఇతరులు 2-4
  • ఇండియా టుడే ; కాంగ్రెస్ 128, బీజేపీ 70, జేడీఎస్ 22, ఇతరులు 2-4
  • జన్ కీ బాత్ ; కాంగ్రెస్ 91-106, బీజేపీ 94-117, జేడీఎస్ 14-24

Also Read: కే‌సి‌ఆర్ ఎఫెక్ట్.. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ !

ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే కాంగ్రెస్ కే మెజారిటీ సర్వేలు అధికారాన్ని కట్టబెట్టగా, జన్ కీ బాత్, న్యూస్ నేషన్ వంటివి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. మరికొన్ని సర్వేలు హంగ్ కు అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ లో కూడా పోటాపోటీ వాతావరణమే నెలకొనడంతో తుది ఫలితాలు ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి.

Also Read: మూడో సారి కే‌సి‌ఆర్ ను సి‌ఎం చేద్దాం !

- Advertisement -