తొమ్మిదో సారి కూడా.. అంబానీనే

214
- Advertisement -

దేశంలో అత్యంత సంపన్నుడిగా వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో నిలిచిన పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ ఆస్తి ఉత్తర యూరోప్‌లోని ఎస్తోనియా దేశ స్థూల జాతీయోత్పత్తితో సమానం. ఈ విషయాన్ని ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది.

దేశంలో అత్యంత సంపన్నులతో కూడిన జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో 22.7 బిలియన్‌ డాలర్లు(రూ. లక్షన్నర కోట్లు) సంపదతో ముఖేశ్‌ మొదటి స్థానంలో నిలువగా.. నాలుగోస్థానంలో నిలిచిన విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ సంపద.. మొజాంబిక్‌ జీడీపీ కన్నా అధికం కావడం గమనార్హం. మొజాంబిక్‌ జీడీపీ 14.7 బిలియన్‌ డాలర్లు (రూ. 98వేల కోట్లు) కాగా.. ప్రేమ్‌జీ సంపద 15 బిలియన్‌ డాలర్లు (రూ. లక్షకోట్లు).

ఇక దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో 16.9 బిలియన్‌ డాలర్ల (రూ. 1.12 లక్షల కోట్ల)తో సన్‌ ఫార్మా అధినేత దిలీప్‌ శాంఘ్వీ రెండోస్థానంలో నిలువగా.. హిందూజా కుటుంబ వ్యాపార సంస్థ 15.2 బిలియన్‌ డాలర్ల (రూ. 1.01 లక్షల కోట్ల)తో నాలుగోస్థానంలో నిలిచింది. 13.90 బిలియన్‌ డాలర్ల (రూ. 92వేల కోట్ల)తో పళ్లోంజీ మిస్త్రీ ఐదో సంపన్న భారతీయుడిగా ఈ జాబితాలో చోటు సాధించారు. మన దేశంలోని తొలి ఐదుగురు సంపన్నుల ఆస్తి మొత్తం కలిపితే 1,230సార్లు మంగళ్‌యాన్‌ చేసి రావచ్చని… లేకపోతే 18సార్లు రియో ఒలింపిక్స్‌ నిర్వహించవచ్చని మ్యాగజీన్ వెల్లడించింది.

- Advertisement -