మంత్రి పదవులపై సమాచారం లేదు:వెంకట్‌రెడ్డి

14
- Advertisement -

మంత్రి పదవులపై నాకు సమాచారం లేదని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంత్రుల విషయంలో నన్ను ఎవరు సంప్రదించలేదని వెల్లడించారు.పేపర్స్, టీవీ ల్లో చూడటమే తప్ప సమాచారం లేదు అన్నారు.

ఇక తనతో బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో భేటీ గురించి ప్రస్తావించారు కోమటిరెడ్డి. నియోజకవర్గంలో పెండింగ్ వర్క్ విషయం లో కలిసానని సుధీర్ రెడ్డి చెప్పారు. సుధీర్ నా బంధువు, అల్లుడు అవుతాడని తెలిపారు వెంకట్ రెడ్డి.

పార్టీలోకి తీసుకొస్తున్నరా అంటే.. అది నాపని కాదని తెలిపారు కోమటిరెడ్డి. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయం తెలియదని చెప్పారు కోమటిరెడ్డి.

Also Read:ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

- Advertisement -